Saturday, December 24, 2016

రూ.2 వేల నోట్లు ముట్టుకోగానే చిరిగిపోతున్నాయ్‌…! చూసి తీస్కోండి..!



రూ.2 వేల నోట్లు ముట్టుకోగానే 

చిరిగిపోతున్నాయ్‌…! చూసి తీస్కోండి..!



గంట‌ల త‌ర‌బ‌డి లైన్‌లో నిలుచుని, ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి రూ.2వేల నోటు తెచ్చుకున్నార‌నుకోండి… అప్పుడు మీకు క‌లిగే సంతోషం ఎలా ఉంటుంది..? స‌ప్త స‌ముద్రాల‌ను అవ‌లీల‌గా ఈదిన ఫీలింగ్ రాదు..?  నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఇప్పుడు స‌గటు పౌరుడి ప‌రిస్థితి దాదాపుగా ఇలాగే త‌యారైంది. ఎన్నో గంట‌ల పాటు లైన్‌లో నించుని అవ‌స్థ ప‌డితే గానీ ఒక్క రూ.2వేల నోటు చేతికి రావ‌డం లేదు. అది కూడా వ‌స్తుందో, రాదో కూడా తెలియ‌దు. ఇక వ‌స్తే… ఆ ఆనందం అంతా ఇంతా కాదు. మ‌రి ఆ ఆనందం కాస్తా ఆవిరైతే..?  చేతికి వ‌చ్చిన నోట్లు వాటంత‌ట అవే చిరిగిపోతే..? అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది..? అదిగో… తిరువ‌నంత‌పురంకు చెందిన ఆ మ‌హిళ‌కు కూడా స‌రిగ్గా ఇదే అనుభ‌వం ఎదురైంది. దీంతో ఆమెకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు.

తిరువ‌నంత‌పురంలోని తాళిప‌రంబ టౌన్ ఫెడ‌రల్ బ్యాంక్ బ్రాంచ్‌లో స్థానికంగా నివాసం ఉండే పీసీ ష‌రీఫా అనే ఓ మ‌హిళ ఈ మ‌ధ్యే రూ.2వేల నోట్లు 5 వ‌ర‌కు తీసుకుంది. అత్యంత క‌ష్టం మీద ఆమె లైన్లో నిల‌బ‌డి మరీ ఆ ప‌ది వేలు డ్రా చేసింది. అయితే క్యాష్ పొందిన కొంత సేప‌టికే ష‌రీఫా ఆనందం కాస్తా ఆవిరై పోయింది. ఆమె తీసుకున్న రూ.2వేల నోట్లు వాటంత‌ట అవే ముట్టుకోగానే చిరిగిపోవ‌డం ప్రారంభించాయి. దీంతో నాలుగు రూ.2వేల నోట్ల‌ను ఆమె ఎలాగో ఖ‌ర్చు చేసేసింది. అయితే మిగిలిన 1 ఆ ఒక్క నోటు మాత్రం పూర్తిగా చిరిగిపోయింది. దీంతో వెంట‌నే ఆమె బ్యాంకు వారిని సంప్ర‌దించ‌గా వారు తామేం చేయ‌లేమ‌ని చేతులెత్తేశారు. ఈ క్ర‌మంలో ష‌రీఫాకు త‌న బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థం కావ‌డం లేదు.
ప్రధాని మోడీ నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించారు స‌రే. ప్రింట్ చేసే కొత్త నోట్ల‌యినా క‌నీస క్వాలిటీ లేకుండా వ‌స్తున్నాయ‌ని తిరువ‌నంత‌పురంకు చెందిన ప‌లువురు ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. మొన్నా మ‌ధ్య రూ.500 కొత్త నోట్లు స‌రిగ్గా ప్రింట్ కాలేద‌ని చెప్పి ప‌లు బ్యాంకుల‌కు చెందిన అధికారులు వాటిని తిరిగి ఆర్‌బీఐ కి పంపించారు. మరి సామాన్య ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న నోట్లు చిరిగిపోతే..? అప్పుడు వారు ఎవ‌రికి చెప్పుకోవాలి..?  వేరే నోట్లు ఎలా పొందాలి..?  బ్యాంకుల‌కు ఓ రూల్… సామాన్యుల‌కు ఓ రూల్‌… ఎలా..? ఆర్‌బీఐ ఈ విష‌యంలో క‌చ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందే. ఇంకా ఇలాంటి చిరిగే నోట్లు ఎన్ని ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా అయ్యాయో ఏమో..? ఏమో… ఎవ‌రికి తెలుసు..?

No comments:

Post a Comment