Wednesday, December 14, 2016

ATM కార్డ్ కు ON / OFF సిస్టమ్ ఇలా సెట్ చేసుకోండి



ATM కార్డ్ కు ON / OFF సిస్టమ్ ఇలా సెట్ చేసుకోండి



పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రం. మీ కార్డే మీ పర్స్ అనే నినాదంతో ముందుకు వెళుతోంది.దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి.
ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.మీ బ్యాంక్ కార్డ్ సురక్షితంగా అయ్యే విధంగా దానికి ON / OFF సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. మీ ATM కార్డ్ ను స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి నియంత్రించొచ్చు.
ఈ యాప్ తో మీ ATM కార్డ్ ను కనెక్ట్ చేసుకుని.. స్విచ్ ఆన్.. ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ATM సెంటర్ కు వెళ్లినప్పుడు ఆన్ చేసుకుంటే.. కార్డ్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కార్డ్ ఆఫ్ లో ఉన్నప్పుడు మీ ATM కార్డ్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయటానికి వీలుకాదు.
ఒక్క ATM సెంటర్ నుంచి కాదు.. ఎక్కడైనా సరే కార్డ్ ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడే మాత్రమే ఆన్ చేసుకుంటే సేఫ్ గా ఉంటుందని SBI అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో అన్ని క్రయ, విక్రయాలు కార్డ్ ద్వారానే జరుగనున్నాయి. ఈ క్రమంలోనే కార్డ్ కు మరింత భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించారు

No comments:

Post a Comment