Monday, December 12, 2016

దేశంలో ఆదాయపరంగా టాప్ లో వున్న దేవాలాయలేమిటో మీకు తెలుసా…


దేశంలో ఆదాయపరంగా టాప్ లో వున్న దేవాలాయలేమిటో మీకు తెలుసా…


మన దేశంలో ఎప్పటినుంచో ఒక ఆచారం వుంది.మనం సంపాదించినదానిలో కొంత దేవుడు కిస్తే మనం చేసిన పాపం కొంతమేర తగ్గుతుందని.అలాగే కొంతమంది దేవుడు మీద వున్న భక్తితో ,ఇంకొంతమంది ఇంకొన్ని కారణాలలో దేవుడి హుండిలలో విలువైన కానుకలను వేస్తారు. ఇలా వేసిన కానుకలతో కొన్ని దేవాలయాలు ఆదాయపరంగా టాప్ లో వున్నాయి. ఇంతకీ ఆ దేవాలయాలలో టాప్ 5 ఏమిటో ఒక సారి చూద్దాం.
1.పద్మనాభస్వామి దేవాలయం, ఈ దేవాలయంలో గత మూడు సంవత్సరాలుగా వెలుగులోకి వచ్చిన గుప్త నిధుల వల్ల ఇది టాప్ వన్ లో వుంది.ఇక్కడ ఎంత డబ్బు వుందో అని చెప్పడానికి వచ్చిన అధికారులు ఇక్కడ వున్న మనీని అంచనా వేయలేకపోతున్నారు.
2.తిరుమల తిరుపతి దేవాస్థానం, కలియుగ ప్రత్యక్ష దేవుని నిలయంగా పేరుపొందిన ఈ దేవాస్థానంను ప్రతిరోజు సూమారుగా 60000 మంది పైగా దర్శించుకుంటారట. అలాగే సీనీ తారలు,వి.ఐ.పి లు కూడా ఈ ఆలయానికి భారీగా కానుకలు సమర్పిస్తారు.
3.షీర్డి సాయిబాబా దేవాలయం, ఈ దేవాలయంలో భక్తులు భారీగా ముడుపులు చదివిస్తారు. అలాగే ఈ దేవాలయానికి భారీగా బంగారం,సిల్వర్ ను భారీ ఎత్తులలో కానుకగా సమర్పిస్తారు.
4.సిద్దివినాయక గుడి, ముంబై లో వున్న సిద్ది వినాయక గుడి ఎప్పుడు భక్తులలో కిటకిటలాడడమే కాకుండా భక్తుల ఇచ్చే కానుకల వల్ల నాల్గవ స్థానంలో వుందట.
5.గోల్డెన్ టెంపుల్, పంజాబ్ లో వున్న అమృత్ సర్ లో సిక్కుల యాత్రిక స్థలంగా మంచి పేరు వున్న దేవాలయం గోల్డెన్ టెంపుల్.అలాగే ఈ టెంపుల్ కి భక్తుల నుంది భారీ విరాళాలు అందుతాయట.

No comments:

Post a Comment