Wednesday, December 14, 2016

గ్యాస్ కస్టమర్లకు ఈజీ గ్యాస్ కార్డులు వచ్చేశాయ్


గ్యాస్ కస్టమర్లకు ఈజీ గ్యాస్ కార్డులు వచ్చేశాయ్



డిజిటల్ ఇండియాలో భాగంగా గ్యాస్ కస్టమర్స్ కు మరింత దగ్గర అయేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్రం. గ్యాస్ బుకింగ్ నుంచి డెలవరీ అయ్యేవరకు వినియోగదారులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నం చేస్తోంది.
కస్టమర్స్ కు ATM కార్డులా పని చేసే ఈజీ గ్యాస్ కార్డును ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ గ్యాస్ కార్డును గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లకు ఇవ్వనుంది. దీని మీద 16 అంకెల నెంబర్ ఉంటుంది. దీన్ని గ్యాస్ కనెక్షన్ కు కనెక్ట్ చేసి… డెలివరీ బాయ్ గ్యాస్ ఇవ్వగానే స్వైప్ చేసేలా ఏర్పాటు చేస్తోంది కేంద్రం.
గ్యాస్ కార్డుతో కస్టమర్ ఇంటి దగ్గర లేకున్నా… పక్కింటి వాళ్లకు కార్డు ఇచ్చి గ్యాస్ తీసుకోవచ్చు. గ్యాస్ డెలివరీ అయ్యాక మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దీంతో సబ్సిడీ కూడా పక్కదారి పట్టకుండా ఉంటుందని భావిస్తోంది కేంద్రం.
ఈజీ గ్యాస్ కార్డ్ ను పుణెలో లాంచ్ చేసిన కేంద్రం , అక్కడ సక్సెస్ కావడంతో హైదరాబాద్ లో లాంచ్ చేయబోతోంది. ఈ కార్డ్ సిస్టమ్ ను HP గ్యాస్ ప్రారంభించింది. ఇప్పటికే సిటీలోని HP గ్యాస్ కస్టమర్లకు స్వైపింగ్ కార్డులను ఇచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
గ్యాస్ కార్డును డెలివరీ బాయిస్ ఆండ్రాయిడ్ ఫోన్ తో ఆపరేట్ చేస్తారు. మిషన్ ను ఫోన్ కు అటాచ్ చేసి కార్డ్ స్వైప్ చేసేలా ఈ మిషన్ ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా.. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా బిల్ పే చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. టెక్నాలజీ డెవలప్ మెంట్ తో కస్టమర్స్ కు ఇబ్బందులు లేకుండా చేస్తోంది కేంద్రం.

No comments:

Post a Comment