Saturday, December 17, 2016

అన్నాడీఎంకే పార్టీని నడిపించండి: శశికళను కలిసిన విజయశాంతి


అన్నాడీఎంకే పార్టీని నడిపించండి: 
శశికళను కలిసిన విజయశాంతి
హైదరాబాద్/చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను శనివారం నాడు ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కలిశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో చిన్నమ్మతో సమావేశమయ్యారు.

అన్నాడీఎంకే పార్టీని ముందు ఉండి నడిపించాలని ఈ సందర్భంగా శశికళను విజయశాంతి కోరారు. అంతకుముందు మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని విజయశాంతి దర్శించుకున్నారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయలలిత మృతి తీరని లోటు అన్నారు. కాగా, జయలలిత ఈ నెల 5వ తేదీన రాత్రి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి అనంతరం ప్రస్తుతం అనధికారికంగా పార్టీ పగ్గాలు శశికళ చేతుల్లోకి వచ్చాయి. త్వరలో ఆమెను పార్టీ చీఫ్‌గా ప్రకటించనున్నారు.

No comments:

Post a Comment