Monday, December 12, 2016

శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఆశక్తికరమైన విషయాలు….

శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు కాలజ్ఞానంలో 
చెప్పిన ఆశక్తికరమైన విషయాలు…. 



ప్రపంచంలో జరగబోవు వింతలు విశేషాలను ముందుగానే ఊహించిన బ్రహ్మంగారి కాలజ్ఞాన అంశాలపై చాలా మందికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏ ఏ అంశాలు ప్రస్తావించారు. ప్రపంచంలో ఏటువంటి అద్భుత వింతలు జరగనున్నాయి అనే వాటిని గురించి తెలుసుకోవాలని చాలా మంది ఇంట్రస్ట్ చూపుతారు. కొంత మంది భవిష్యత్ ను ముందుగా ఊహించడం బ్రహ్మంగారి మహిమ అంటారు. మరికొంత మంది బ్రహ్మంగారు మంచి ప్రెడిక్షన్ అండ్ ఫీచర్ రైటర్ అని అంటుంటారు.
ఎవరి నమ్మకాలు వారివి…అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏ ఏ అంశాలను చెప్పారో ఓ సారి చూద్దాం.
1. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
2. రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
3. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
4. పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
5. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
6. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
7. దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
8. మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
9. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
10. నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
11. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
12. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
13. ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
14. ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
15. ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
16. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
17. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
18. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
19. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
20. విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
21. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
22. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
23.ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
24. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
25. 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి.
26. నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
27. కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది.
28. కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
29. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
30. పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
31. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
32. బనగాన పల్లెలో వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
33. గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
34. మహానంది మరుగున మహిమలు పుడతాయి..
35. కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.

No comments:

Post a Comment