Monday, December 12, 2016

పుట్టుమచ్చల వల్ల పురుషుల జీవితం ఎలా వుంటుందో తెలుసా….


పుట్టుమచ్చల వల్ల పురుషుల జీవితం 

ఎలా వుంటుందో తెలుసా….


చాలా మంది ఈ టైటిల్ చూడగానే కొద్దిగా నవ్వి వుంటారు. కాని నిజానికి పుట్టుమచ్చల వల్ల మన భవిష్యత్తును కొంత మేర అంచనా వేయవచ్చు అని అంటున్నారు జ్యోతిష్యులు.కొంత మంది ఇది నమ్మోచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు.కాని పుట్టు మచ్చల వల్ల కూడా భవిష్యత్ ఆధారపడివుంటుంది.ఇదే ప్రామణికం కాదు. ఇది ఒక కారణం మాత్రమే. ఇకపోతే పురుషులలో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వుంటే,వారి జీవితం ఎలా వుండబోతుందో ఇప్పుడు చూడవచ్చు.

1. పుట్టు మచ్చ కనుబొమల మహ్ద్య వుంటే ఆ వ్యక్తి ఎక్కువ కాలం బతుకుతాడంట. అలాగే బంధుప్రియుడు గా వుంటూనే భోగాలయందు ఆసక్తిని కలిగి వుంటాడు.
2. తలలో పుట్టు మచ్చలు వున్న వారికి గర్వం ఎక్కువ గాని వీరు ప్రతి అంశాన్ని చాలా క్షుణంగా గమనించి,కీర్తి ప్రతిష్టలను పొందుతారు.
3. నుదుట మీద వుంటే రాజకీయాలలో బాగా రాణిస్తారు. స్వయం శక్తి, ఆర్ధిక వెసులబాటు వీరికి ఎక్కువ వుంటుంది
4. అలాగే నుదుటి కింది భాగంలో వుంటే ఏకాగ్రతను కలిగి విజయాలు ఎక్కువగా సాధిస్తారు.
5. ముక్కు పై వుంటే క్రమశిక్షణ తక్కువ. చెవి కింది భాగాన వుంటే ధనంతో పాటు కీర్తి ప్రతిష్టలను పొందుతారు.
6. బుగ్గపై వుంటే రాజకీయాలలో రాణించి ఆస్తులు కూడగడతారు.
7. నాలుక పై వుంటే విద్య బాగా అబ్బుతుంది. అలాగే చాలా తెలివిగా వ్యవహారిస్తారు.
8. భుజంపై వుంటే మంచి మర్యాద బాగా అబ్బుతుంది. అలాగే చాలా కష్టపడి పని చెసి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్తారు.
9. శరీర ముందు భాగంలో వుంటే ఆకస్మిక ధనలాభం.
10. శరీర వెనుక భాగంలో వుంటే కష్టపడి పని చేసిన ప్రతి ఫలం వుండదు. అలాగే వీరి చేసిన ప్రతి పని వేరోకరి లాభం చేకూరుస్తుంది.

No comments:

Post a Comment