Wednesday, December 28, 2016

తెలంగాణలో తగ్గనున్న సెల్‌ఫోన్ల ధరలు: ఎందుకంటే..


తెలంగాణలో తగ్గనున్న సెల్‌ఫోన్ల ధరలు: ఎందుకంటే..


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇక సెల్‌ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. ఎందుకంటే తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాల్లో బుధవారం వ్యాట్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. స‌భ‌లో బుధవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్‌) సవరణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం ఈ బిల్లును శాస‌న‌స‌భ ఆమోదించింది. ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ... నోట్ల రద్దు నేప‌థ్యంలో న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్సహించడం కోసం సెల్‌ఫోన్లపై వ్యాట్ తగ్గింపు బిల్లును తీసుకొచ్చామ‌ని తెలిపారు. దీంతో మొబైల్ ఫోన్లపై 14.5 శాతం ఉన్న వ్యాట్ 5 శాతానికి తగ్గిందని చెప్పారు. డిజిట‌లైజేష‌న్‌ అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని త‌మ స‌ర్కారు కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. కాగా, వ్యాట్ తగ్గింపును బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు స్వాగతించారు. వ్యాట్ సవరణ బిల్లు ఆమోదంతో తెలంగాణలో సెల్‌ ఫోన్ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి.

Monday, December 26, 2016

ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పొందడం సులభం….ఇదిగో ఇవి ఫాలో అయితే చాలు.!


ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పొందడం సులభం….

ఇదిగో ఇవి ఫాలో అయితే చాలు.!


క్రెడిట్ కార్డ్‌..! పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి మాత్ర‌మే అందుబాటులో ఉండే ఓ విలాస‌వంత‌మైన స‌దుపాయం. ఏది కొనాల‌న్నా కార్డ్ లిమిట్‌కు అనుగుణంగా కొన‌వ‌చ్చు. అటు త‌రువాత 45 రోజుల వ‌ర‌కు బిల్లు చెల్లించేందుకు గ‌డువు ఉంటుంది. ఇక టీవీ, ఫోన్ వంటి ఏదైనా వ‌స్తువు కొంటే దాన్ని ఎంచ‌క్కా ఒకే క్లిక్‌తో ఈఎంఐల‌లోకి క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌చ్చు. ఇవే కాదు, క్రెడిట్ కార్డ్ వ‌ల్ల ఇంకా ఎన్నో ఉప‌యోగాలే ఉంటాయి. మీ ఆర్థిక లావాదేవీల‌ను ప‌రిశీలించిన బ్యాంక్ మీకు కొంత న‌గ‌దును క్రెడిట్ రూపంలో అప్పు లాగా ఇస్తుంది. దాన్ని ఉప‌యోగించుకోవాలంటే కార్డ్ ఇస్తారు. అదే క్రెడిట్ కార్డు అయింది. అయితే ముందే చెప్పాం క‌దా. ఆ కార్డు ఉండాలంటే సామాన్యుల‌కు వీలు కాద‌ని. కానీ క్రెడిట్ కార్డును సుల‌భంగా పొందాలంటే అందుకు ఓ మార్గం ఉంది. దాని వ‌ల్ల ఎలాంటి ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను బ్యాంకుకు స‌మ‌ర్పించాల్సిన ప‌ని లేదు. వెంట‌నే కార్డు జారీ అవుతుంది. రిజెక్ట్ అవుతుంద‌న్న భ‌యం కూడా ఉండ‌దు. ఇంత‌కీ క్రెడిట్ కార్డును అంత సుల‌భంగా ఎలా పొంద‌వ‌చ్చంటే..!

ఫిక్స్‌డ్ డిపాజిట్‌… అవును, అదే. చాలా మందికి దీని గురించి తెలుసు. అయితే మీరు బ్యాంకులో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌నే సెక్యూరిటీగా పెడితే అందుకు ఆ బ్యాంకు మీకు క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. ఇందుకు గాను ఎస్‌బీఐ బ్యాంకులో అయితే క‌నీసం మీరు రూ.20వేల వ‌ర‌కు మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అందులో 70 శాతం అంటే రూ.14వేల వ‌ర‌కు క్రెడిట్ లిమిట్ వ‌స్తుంది. ఆ లిమిట్‌లో మీరు క్రెడిట్ కార్డును వాడుకోవ‌చ్చు. అయితే లిమిట్ మించితే ఫైన్ ప‌డుతుంది. ఈ క్ర‌మంలో మీరు ఏ వ‌స్తువులు కొన్నా దాంతో ఆ క్రెడిట్ కార్డు బిల్‌లో యాడ్ అవుతుంది. నెల అయ్యేస‌రికి అలాంటి బిల్స్ అన్నీ క‌లిపి పూర్తి బిల్ వ‌స్తుంది. అప్పుడు ఆ బిల్‌ను నిర్దేశించిన తేదీలోగా క‌ట్టాల్సి ఉంటుంది. లేదంటే ఫైన్ ప‌డుతుంది. అయితే కొన్ని క్రెడిట్ కార్డుల్లో ఫ్లెక్సి పే అనే ఆప్ష‌న్ కూడా ఉంటుంది. దీని వ‌ల్ల రూ.2500 అంత‌క‌న్నా ఎక్కువ మొత్తంలో మీరు ఏదైనా వ‌స్తువును కొని ఉంటే దాన్ని ఈఎంఐల‌లోకి సుల‌భంగా ఒకే ఒక్క క్లిక్‌తో క‌న్వ‌ర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు బిల్‌లో ఈఎంఐ అమౌంట్ మాత్ర‌మే యాడ్ అయి బిల్ త‌క్కువ‌గా వ‌స్తుంది. దాన్ని క‌ట్ట‌డం కూడా సుల‌భ‌మే. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, డెబిట్ కార్డ్‌, ఇత‌ర క్రెడిట్ కార్డులు, వాలెట్స్‌, క్యాష్‌, చెక్కుల రూపంలో ఆ బిల్లును క‌ట్ట‌వ‌చ్చు.
అయితే రూ.20వేల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు క్రెడిట్ కార్డును ఇచ్చే సౌక‌ర్యం కేవ‌లం ఎస్‌బీఐలో మాత్ర‌మే ఉంది. ఇత‌ర బ్యాంకుల్లో కావాలంటే రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. కానీ పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో త్వ‌ర‌లో అన్ని బ్యాంకుల్లోనూ రూ.20వేలు లేదా రూ.25వేలు డిపాజిట్ చేస్తేనే క్రెడిట్ కార్డ్ జారీ చేసేలా సుల‌భ‌మైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఎంచ‌క్కా రూ.20వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డు సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. ఓ వైపు ఫిక్స్‌డ్ రూపంలో మ‌న డ‌బ్బు బ్యాంక్ వ‌ద్ద ఉంటుంది. దానికి వ‌డ్డీ ఎలాగూ వ‌స్తుంది. మ‌రో వైపు క్రెడిట్ కార్డు సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అంతేగా..!

Sunday, December 25, 2016

ఫోన్ నీళ్లలో పడిందా… ఐతే వెంటనే ఇలా చెయ్యండి


ఫోన్ నీళ్లలో పడిందా… ఐతే వెంటనే ఇలా చెయ్యండి


ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడితే..? ఇంకేముంది! అంతా అయిపోయింది. అంటూ చాలా మంది కంగారు పడతారు. అయితే నీటిలో ఫోన్ పడగానే కంగారు పడకుండా, ఎటువంటి ఆందోళన చెందకుండా కింద పేర్కొన్న విధంగా చేస్తే అధిక శాతం వరకు ఎలాంటి రిపేర్ చేయకుండానే డివైస్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
1. నీటిలో పడ్డ ఫోన్‌ను తీసిన వెంటనే ఆన్ చేయకూడదు. ఫోన్‌పై ఉండే బటన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ చేయకూడదు.
2. ఫోన్‌ను ఊపడం, విసరడం వంటివి చేయకూడదు. ఏం తెలియకుండా ఫోన్ పార్ట్స్‌ను విడదీయకూడదు.
3. లోపల నీరు చేరిందేమోనని నోటితో గాలిని ఊదకూడదు. ఇలా చేస్తే నీరు డివైస్‌లోని సున్నితమైన ప్రదేశాల్లోకి వెళ్లి మరింత డ్యామేజ్‌కు గురి చేస్తుంది.
4. ఏ పద్ధతిలోనూ ఫోన్‌ను హీట్ చేయకూడదు.
5. నీటిలో పడినప్పటికీ ఇంకా ఆన్‌లోనే ఉంటే ఫోన్‌ను వెంటనే ఆఫ్ చేసేయాలి.
6. ఫ్లిప్ కవర్/బ్యాక్ కేస్, సిమ్, మెమోరీ కార్డు, బ్యాటరీలను తీయాలి.
7. పొడి గుడ్డ లేదా పేపర్ టవల్‌తో ఫోన్ డ్రై అయ్యేంత వరకు తుడవాలి. ఫోన్‌లో ఇతర ప్రదేశాలకు నీరు వెళ్లకుండా జాగ్రత్తగా పట్టుకుని ఈ పని చేయాలి.
8. బయటికి రాని నీటిని వాక్యూమ్ సహాయంతో తీసేయాలి.
9. కవర్ చేయబడి ఉన్న సంచిలోని బియ్యంలో ఫోన్‌ను పూర్తిగా కప్పాలి. ద్రవాలను పీల్చుకునే శక్తి బియ్యానికి ఎక్కువగా ఉంది. అందుకే ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది.
10. ఒకటి లేదా రెండు రోజుల పాటు ఫోన్‌ను అలాగే ఉంచాలి. అనంతరం తీసి ఎప్పటిలాగే ఉపయోగించవచ్చు. అయినప్పటికీ ఫోన్ ఆన్ కాకపోతే ముందు చార్జింగ్ కానివ్వాలి. తర్వాత కూడా ఆన్ కానట్టయితే బ్యాటరీ మార్చి చూడవచ్చు. ఫలితం లేకపోతే చివరిగా సర్వీస్ సెంటర్‌కే తీసుకెళ్లడం మంచిది. అయితే ఫోన్ ఆన్ అయి ఉపయోగంలోకి వస్తే మాత్రం దాన్ని కొద్ది రోజులు జాగ్రత్తగా పరిశీలించాలి. అందులోని హార్డ్‌వేర్ అంతా పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుందో లేదో చూడాలి.

Saturday, December 24, 2016

అక్కినేని వారి రెండో నిశ్చితార్థం తేదీ ఇదే ...: ఇప్పుడు సమంతా నాగచైతన్య ల వంతు


అక్కినేని వారి రెండో నిశ్చితార్థం తేదీ ఇదే ...: 

ఇప్పుడు సమంతా నాగచైతన్య ల వంతు


టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అందరికీ తెలిసిన అపీషియల్ మ్యాటరే. సమంత, నాగ చైతన్య మధ్య చాలా ఏళ్ల నుండి ప్రేమాయణం నడుస్తోంది. అయితే సమంత స్వయంగా విషయం బయట పెట్టే వరకు ఎవరూ పసిగట్టేలేక పోయారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.... తాను గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో నాగ చైతన్య గురించి క్లూ ఇచ్చానని, అయినా మీడియా వారు పసిగట్టలేకపోయారని సమంత చెప్పింది. క్లూ ఇవ్వటం సమంత పద్దతి అని తెలియగానే తన చేతి ఉంగరం ఫొటోని పోస్ట్ చేయటం తో ఈ ఇద్దరికీ రహస్యంగా ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రచారం జరిగింది.

అసలు ఇలాంటి ప్రచారం మొదలు కావడానికి కారణం సమంత. సమంత తన సోషల్ మీడియా పేజీలో ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోస్ చూసిన వారంతా ఇద్దరికీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్లు చర్చించుకున్నారు. కా ఆ విషయం ఎవరూ ధృవీకరించలేదు. కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. అఖిల్ నిశ్చితార్ధం వేడుకలో కలిసి సందడి చేశారు కానీ.. కనీసం వీళ్ళ నిశ్చితార్ధం మాట కూడా చెప్పలేదు. ఇప్పుడా విషయం తెలిసిపోయింది. 2017 జనవరి 29న చైతు-శామ్స్ ల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరపనున్నారట. ఇప్పటికే చైతు నిశ్చితార్ధానికి సంబంధించిన పనులు కూడా మొదలైపోగా.. నాగ్ ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారట.

అఖిల్ నిశ్చితార్ధం-వివాహం మధ్య ఆరు నెలలు గ్యాప్ ఉండడానికి కారణం కూడా.. మధ్యలో చైతు-సమంతల ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేయడానికే అంటున్నారు. జనవరి నెలాఖరులో వీరి నిశ్చితార్ధం పనులు పూర్తి చేశాక.. అఖిల్ పెళ్లి పనులు మొదలుపెడతాడట నాగ్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అఖిల్-శ్రేయా.. చైతు-సమంత.. రెండు జంటల పెళ్లిళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్స్ గానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

రూ.2 వేల నోట్లు ముట్టుకోగానే చిరిగిపోతున్నాయ్‌…! చూసి తీస్కోండి..!రూ.2 వేల నోట్లు ముట్టుకోగానే 

చిరిగిపోతున్నాయ్‌…! చూసి తీస్కోండి..!గంట‌ల త‌ర‌బ‌డి లైన్‌లో నిలుచుని, ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి రూ.2వేల నోటు తెచ్చుకున్నార‌నుకోండి… అప్పుడు మీకు క‌లిగే సంతోషం ఎలా ఉంటుంది..? స‌ప్త స‌ముద్రాల‌ను అవ‌లీల‌గా ఈదిన ఫీలింగ్ రాదు..?  నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఇప్పుడు స‌గటు పౌరుడి ప‌రిస్థితి దాదాపుగా ఇలాగే త‌యారైంది. ఎన్నో గంట‌ల పాటు లైన్‌లో నించుని అవ‌స్థ ప‌డితే గానీ ఒక్క రూ.2వేల నోటు చేతికి రావ‌డం లేదు. అది కూడా వ‌స్తుందో, రాదో కూడా తెలియ‌దు. ఇక వ‌స్తే… ఆ ఆనందం అంతా ఇంతా కాదు. మ‌రి ఆ ఆనందం కాస్తా ఆవిరైతే..?  చేతికి వ‌చ్చిన నోట్లు వాటంత‌ట అవే చిరిగిపోతే..? అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది..? అదిగో… తిరువ‌నంత‌పురంకు చెందిన ఆ మ‌హిళ‌కు కూడా స‌రిగ్గా ఇదే అనుభ‌వం ఎదురైంది. దీంతో ఆమెకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు.

తిరువ‌నంత‌పురంలోని తాళిప‌రంబ టౌన్ ఫెడ‌రల్ బ్యాంక్ బ్రాంచ్‌లో స్థానికంగా నివాసం ఉండే పీసీ ష‌రీఫా అనే ఓ మ‌హిళ ఈ మ‌ధ్యే రూ.2వేల నోట్లు 5 వ‌ర‌కు తీసుకుంది. అత్యంత క‌ష్టం మీద ఆమె లైన్లో నిల‌బ‌డి మరీ ఆ ప‌ది వేలు డ్రా చేసింది. అయితే క్యాష్ పొందిన కొంత సేప‌టికే ష‌రీఫా ఆనందం కాస్తా ఆవిరై పోయింది. ఆమె తీసుకున్న రూ.2వేల నోట్లు వాటంత‌ట అవే ముట్టుకోగానే చిరిగిపోవ‌డం ప్రారంభించాయి. దీంతో నాలుగు రూ.2వేల నోట్ల‌ను ఆమె ఎలాగో ఖ‌ర్చు చేసేసింది. అయితే మిగిలిన 1 ఆ ఒక్క నోటు మాత్రం పూర్తిగా చిరిగిపోయింది. దీంతో వెంట‌నే ఆమె బ్యాంకు వారిని సంప్ర‌దించ‌గా వారు తామేం చేయ‌లేమ‌ని చేతులెత్తేశారు. ఈ క్ర‌మంలో ష‌రీఫాకు త‌న బాధ ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థం కావ‌డం లేదు.
ప్రధాని మోడీ నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించారు స‌రే. ప్రింట్ చేసే కొత్త నోట్ల‌యినా క‌నీస క్వాలిటీ లేకుండా వ‌స్తున్నాయ‌ని తిరువ‌నంత‌పురంకు చెందిన ప‌లువురు ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. మొన్నా మ‌ధ్య రూ.500 కొత్త నోట్లు స‌రిగ్గా ప్రింట్ కాలేద‌ని చెప్పి ప‌లు బ్యాంకుల‌కు చెందిన అధికారులు వాటిని తిరిగి ఆర్‌బీఐ కి పంపించారు. మరి సామాన్య ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న నోట్లు చిరిగిపోతే..? అప్పుడు వారు ఎవ‌రికి చెప్పుకోవాలి..?  వేరే నోట్లు ఎలా పొందాలి..?  బ్యాంకుల‌కు ఓ రూల్… సామాన్యుల‌కు ఓ రూల్‌… ఎలా..? ఆర్‌బీఐ ఈ విష‌యంలో క‌చ్చితంగా జోక్యం చేసుకోవాల్సిందే. ఇంకా ఇలాంటి చిరిగే నోట్లు ఎన్ని ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా అయ్యాయో ఏమో..? ఏమో… ఎవ‌రికి తెలుసు..?

రిలయన్స్ జియో మరో సంచలన ప్రకటన… 600జీబీ 500 రూపాలయకే!


రిలయన్స్ జియో మరో సంచలన ప్రకటన… 

600జీబీ 500 రూపాలయకే!


తాజాగా రిలయన్స్ సంస్థ నుంచి వచ్చిన ‘జియో’ టెలికాం రంగంలోనే ఒక సంచలనాన్ని సృష్టించింది. దీంతో జియోకి వచ్చిన రెస్పాన్స్ తో ఎలాగైనా దాన్ని నంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి ముఖేష్ అంబాని చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తక్కువ ధరలకే ఇంటర్నెట్ డాటా, వాయిస్ కాల్స్ ను ప్రవేశపెట్టి కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నారు. తాజాగా జియో సంస్థ కేవలం 185 రూపాయలకే డీటీహెచ్ సేవలను అందించనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది ఆమాత్రం ఇప్పటికీ కార్య రూపం దాల్చలేదు.
అయితే తాకా సమాచారం ప్రకారం జియో మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశం మొత్తం ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి, దాని సేవలను తక్కువ రేటుకే అందిచదానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయాన్ని మీడియాకి తెలుపుతూ..అతి త్వరలోనే జియో కస్టమర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్టు చెప్పింది. కేవలం 50ఓ రూపాయలకే 600 జీబీ డేటా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది.
ఇక ఇంటర్నెట్ స్పీడ్ కూడా 120ఎంబీపీఎస్ నుంచి 1జీబీ మధ్యలో ఉంటుందని ప్రకటించింది. జియో గిగాఫైబర్ స్పెషల్ ఆఫర్ ప్లాన్ పేరుతో బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటన్నిటికీ కూడా ‘జియోకేర్. నెట్‌’ అనే సైట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను ఉంచింది. జియో గిగాఫైబర్ బ్రాడ్‌ బాండ్ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా వెల్‌ కమ్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల పాటు అపరిమిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. అతి త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను తీసుకు రానున్నట్టు ప్రకటించింది యాజమాన్యం.

BSNL లో భారీగా ఉద్యోగాలు , లక్షల్లో జీతం


BSNL లో భారీగా ఉద్యోగాలు , లక్షల్లో జీతం


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్ఎల్) జూనియర్ టెలికమ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాల్లోని జూనియర్ టెలికమ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
జూనియర్ టెలికమ్ ఆఫీసర్: 2510
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్.
విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. గేట్- 2017లో అర్హత సాధించాలి.
వయసు: 1 అక్టోబరు 2016 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్ – 2017, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ముందు గేట్్ర 2017 రిజిస్ట్రేషన్ నెంబర్‌ ద్వారా లాగిన్ అయిన పూర్తి వివరాలను అందులో నమోదు చేయాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జనవరి 1
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జనవరి 31

Friday, December 23, 2016

ఊరందరికీ ఉపాధి చూపిన యువతి.పనుల్లేక ఖాళీగా ఉన్న వారంతా…ఇప్పుడు చేతినిండా పనులతో ఫుల్ బిజీ అయ్యారు.!


ఊరందరికీ ఉపాధి చూపిన యువతి.పనుల్లేక ఖాళీగా ఉన్న వారంతా…ఇప్పుడు చేతినిండా పనులతో ఫుల్ బిజీ అయ్యారు.!


నేటి ఆధునిక ప్ర‌పంచంలో గ్రామాలు, మారుమూల ప‌ల్లెల సంగ‌తి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. అక్క‌డ ఉండే వారికి చేద్దామంటే ప‌ని ఉండ‌దు. తిందామంటే స‌రైన తిండి దొర‌క‌దు. ఈ క్ర‌మంలో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో పొట్ట చేత ప‌ట్టుకుని ప‌ట్ట‌ణాల‌కు, న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన దుస్థితి వ‌స్తోంది. అక్క‌డైనా స‌రైన ప‌ని దొరికి, తిండానికి ఇంత తిండి దొరుకుతుందా, అంటే అదీ గ‌గ‌నమే. అలా ఉన్నాయి నేటి ప‌ల్లె వాసుల క‌ష్టాలు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న అలాంటి ఎన్నో ప‌ల్లెలు నేడు ప్ర‌జ‌లు లేక బోసిపోతున్నాయి. ప‌ల్లెలు, గ్రామాలే మేటి భార‌తానికి ప‌ట్టుకొమ్మ‌లు అని ఎవ‌రో అన్నారు. కానీ అలాంటి ప‌ట్టుకొమ్మ‌లు నేడు ఎండిపోయి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అయితే ప‌ల్లెల ప‌రిస్థితి ఇంత ద‌య‌నీయంగా ఉన్నా ఎవ‌రూ వాటి స్థితిని మార్చ‌డం కోసం ముందుకు రావ‌డం లేద‌నే మాట స‌త్యం. ఎవ‌రో కొద్ది మంది దాత‌లు ఊర్ల‌ను ద‌త్త‌త తీసుకుని పుణ్యం క‌ట్టుకుంటున్నారు కానీ, ఇంకా చాలా వ‌ర‌కు గ్రామాల ప‌రిస్థితి మార‌లేదు. ఏ ఇంటిని చూసినా బోసిపోయిన మ‌నుషుల‌తోనే క‌నిపిస్తోంది. అయితే అలాంటి ఇండ్ల‌లో మ‌ళ్లీ న‌వ్వుల పువ్వులు, సంతోషాలు పూయించేందుకు, బోసిపోయిన గ్రామాల‌ను తిరిగి సంద‌డిగా మార్చేందుకు న‌డుం క‌ట్టింది ఆ యువ‌తి. వ‌య‌స్సు చిన్న‌దైనా ఆమె చేసిన పెద్ద‌ ప్ర‌య‌త్నం వ‌ల్ల బోసిపోయిన ప‌ల్లెలు మ‌ళ్లీ మ‌నుషుల‌తో, వారి న‌వ్వుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఇంత‌కీ ఆ యువ‌తి ఎవ‌రు..? ఏం చేసింద‌నేగా..? మీ ప్ర‌శ్న‌..! అయితే ఆ ప్ర‌శ్న‌కు సమాధానం ఇదిగో
ఆమె పేరు దివ్యా రావ‌త్‌. ఉత్త‌రాఖండ్ నివాసి. ఢిల్లీలో సోష‌ల్ వ‌ర్క్ కోర్సులో మాస్ట‌ర్స్ డిగ్రీ చేస్తోంది. ఇందులో భాగంగా ఆమె ప్రాజెక్ట్ వ‌ర్క్ కోసం ఓ ఎన్‌జీవోలో చేరింది. ఈ క్ర‌మంలో ఆమె ఉత్త‌రాఖండ్‌లోని ప‌లు గ్రామాల‌ను సంద‌ర్శించాల్సి వ‌చ్చింది. అయితే ఆ గ్రామాల్లో దాదాపుగా ఎవరూ నివాసం ఉండ‌క‌పోవ‌డంతో అవ‌న్నీ ఆమెకు వెల వెల బోయ క‌నిపించాయి. ఎక్క‌డో చాలా దూరంలో ఒక‌టి, రెండు ఇండ్లు మాత్రమే మ‌నుషుల‌తో క‌నిపించాయి. దీంతో ఆమె ఆలోచ‌న‌లో ప‌డింది. అస‌లు ఎందుకు గ్రామాలు అలా మారాయ‌ని అన్వేషించింది. ఈ క్ర‌మంలోనే అందుకు కార‌ణాల‌ను కూడా ఆమె తెలుసుకుంది. ఆయా గ్రామాల్లో చేసేందుకు ప‌ని లేక‌పోవ‌డంతో అక్క‌డి వారంతా ప‌ట్ట‌ణాల‌కు, న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్లార‌ని గ‌మ‌నించింది. దీంతో వారిని ఎలాగైనా పల్లెల‌కు ర‌ప్పించి, వారంత‌ట వారే ఆర్థికంగా ఎదిగేలా చేయాల‌నుకుంది.
అలా దివ్య తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని వెంటనే అమ‌లు చేసే ప‌నిలో ప‌డింది. అయితే ఆమెకు అప్ప‌టికింకా స‌రైన ఆలోచ‌న రాలేదు. ఆయా గ్రామ‌స్తుల‌కు ఎలాంటి ఉపాధి క‌ల్పించాలా అని ఆలోచించింది. దీంతో వెంట‌నే ఓ ఆలోచ‌న ట‌క్కున వ‌చ్చేసింది. అదే పుట్ట‌గొడుగుల పెంప‌కం. అదే ఎందుకంటే సాధార‌ణ కూర‌గాయ‌లైతే కేజీకి మ‌హా అయితే రూ.40 దాకా ప‌లుకుతాయి. కానీ పుట్ట గొడుగులైతే కేజీకి ఏకంగా రూ.100 వ‌ర‌కు ప‌లుకుతాయి. అంతేకాదు, పుట్ట‌గొడుగుల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది. దీంతో వాటి పెంప‌కం ఎలా చేప‌డతారో క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసింది. అంతే, కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో సౌమ్య ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ‌ను స్థాపించి, దాని ద్వారా పుట్ట‌గొడుగుల పెంప‌కాన్ని చేప‌ట్టింది. గ‌దుల్లోనే నిర్దిష్ట‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో, చాలా త‌క్కువ వ్య‌యంతో వాటిని పెంచే వీలుండ‌డంతో అన‌తి కాలంలోనే ఆమె అనుకున్న నిర్ణ‌యానికి ఆరంభం ల‌భించింది. చాలా మంది గ్రామ‌స్తులు ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చి పుట్ట‌గొడుగుల పెంప‌కం గురించి నేర్చుకోవ‌డం, దానికి త‌గిన‌ట్టుగానే దివ్య వారికి స‌హాయం చేయ‌డం, వారు కూడా పుట్ట‌గొడుగుల పెంప‌కం ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లు పెట్టారు. ఇంకేముంది, సొంత గ్రామాల్లోనే చ‌క్క‌ని ఉపాధి దొర‌క‌డంతో ప‌ట్ట‌ణాల‌కు, న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్లిన వారు తిరిగి గ్రామాల‌కు రావ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇది ఆరంభ‌మేన‌ని, ప్ర‌తి ప‌ల్లెలోనూ ఇలాంటి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తే అప్పుడు వ‌ల‌స‌లు త‌గ్గించ‌వ‌చ్చ‌ని, దాంతో ప‌ల్లెలు మేటి భార‌తానికి ప‌ట్టుకొమ్మ‌లు కావ‌డం ఖాయ‌మ‌ని దివ్య చెబుతోంది. అంతేగా మ‌రి..! ఏది ఏమైనా మ‌న నాయ‌కులు, ప్ర‌భుత్వాలు చేయ‌లేని ప‌నిని ఓ యువ‌తి చేస్తుండ‌డం నిజంగా హ‌ర్షించ‌ద‌గ్గ విషయం.

చక్కని ఎద్దు… కధ..


చక్కని ఎద్దు… కధ..అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది… అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.
గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.
ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ “నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం” అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, “పందెం అంటే పందెం” అన్నారు.
పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ ‘లాగు లాగు’ అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.
గోపయ్యకు తల తీసేసినట్లయింది. ‘ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?’ అని చికాకు మొదలైంది- ఆ చికాకులో ‘తను దానికి లాగమని చెప్పనేలేదు’ అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది ‘నా పరువు తీస్తోంది’ అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: “వెయ్యి నాణేలు… పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!” అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.
గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.
“గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!” అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!
దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: ‘ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!’
గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.
తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. ‘ఈసారి పందెం రెండు వేల నాణేలు’ అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, ‘లాగురా!’ అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!
గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- ‘ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు’ అని.
చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ…
జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.
ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి చెయ్యడం

డబ్బు మనుషుల్ని ఎంత పాడు చేస్తుందో చెప్పే అద్భుతమైన నీతి కధ తప్పకుండా చదవండి షేర్ చేయండి


డబ్బు మనుషుల్ని ఎంత పాడు చేస్తుందో చెప్పే అద్భుతమైన నీతి కధ 

తప్పకుండా చదవండి షేర్ చేయండి


ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు. అందుకాయన… “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.” వాళ్ళిద్దరూ భయంతో… “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.
“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన. “ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. “బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా “ఎక్కడ?” అని అడిగారు.
“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. “ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.
“అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.
అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. “ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.
ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… “వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.
అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. “పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకునిఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. “సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.
గమనిక : రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత్త.

Wednesday, December 21, 2016

స్కూల్ బ్యాగులు కావ‌వి… పిల్ల‌ల పాలిట బండ రాయి మూట‌లు..!


స్కూల్ బ్యాగులు కావ‌వి…
పిల్ల‌ల పాలిట బండ రాయి మూట‌లు..!
ప్రైవేట్ స్కూల్స్ కళ్ళు తెరిచేదాకా  షేర్ చేయండి!

టెక్ట్స్ బుక్స్‌… నోట్ బుక్స్‌… వ‌ర్క్ బుక్స్‌… పెన్నులు, పెన్సిళ్లు, టిఫిన్‌, వాట‌ర్ బాక్సులు… ఇలా చెప్పుకుంటూ పోతే నేడు స్కూల్ పిల్ల‌లు త‌మ త‌మ బ్యాగుల్లో కేజీల కొద్దీ బ‌రువును రోజూ స్కూల్‌కు మోసుకెళ్తున్నారు. ఒక‌ప్పుడు మ‌హా అయితే ఒక‌టి రెండు పుస్త‌కాలు, నోట్సులు మాత్ర‌మే తీసుకెళ్లేవారు. కానీ కాలం మారింది క‌దా… అన్ని రంగాల్లోనూ పోటీ పెరిగిపోయింది. దీంతో త‌మ పిల్ల‌లు ఎక్క‌డ వెన‌క‌బ‌డిపోతారేమోనన్న భావ‌న‌లో త‌ల్లిదండ్రులు వారి చ‌దువు ప‌ట్ల అత్యంత శ్ర‌ద్ధ‌ను క‌న‌బ‌రుస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ పిల్ల‌లు రోజూ చ‌దువుకోసం మోసుకుపోయే పుస్త‌కాల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రైమ‌రీ స్కూల్ చిన్నారులు నిత్యం ఎంత బ‌రువు మోస్తున్నారో తెలుసా..? 6 కిలోల‌కు పైనే. అది హై స్కూల్ విద్యార్థుల‌కైతే ఇంకా రెట్టింపు స్థాయిలో 12 కిలోలుగా ఉంది. ఇది మేం చెబుతోంది కాదు, ఓ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో తేలిన నిజ‌మిది.

దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిల‌బ‌స్ చెబుతున్న పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు నిత్యం కొన్ని కిలోల బ‌రువును స్కూల్‌కు మోసుకెళ్తున్నార‌ట‌. పైనే చెప్పాం క‌దా… అంతే స్థాయిలో బ‌రువును వారు నిత్యం మోస్తున్నారు. దీంతో స్కూల్ అయిపోయేసరికి విపరీతంగా అల‌సిపోతూ ఆపైన అనేక ర‌కాల అనారోగ్యాల‌కు గుర‌వుతున్నార‌ని తెలిసింది. అంతేకాదు, ఇప్పుడు స్కూల్స్‌లోనే పిల్ల‌లు అధిక స‌మ‌యం ఉంటున్నార‌ట‌. ఉద‌యం స్కూల్‌కు వెళితే మళ్లీ సాయంత్ర‌మే వచ్చేది. అప్పుడు కూడా ట్యూష‌న్లు గ‌ట్రా ఉంటుండ‌డంతో పిల్ల‌ల‌కు ఆడుకునేందుకు, త‌ద్వారా శారీర‌కంగా, మాన‌సికంగా ఉల్లాసం పొందేందుకు కూడా వీలుండ‌డం లేద‌ని స‌ర్వేలో తెలిసింది.

పాఠ‌శాలల్లో క్లాస్ టైమింగ్స్‌ను త‌గ్గించ‌డంతోపాటు డిజిటల్ రూపంలో క్లాసులను చెబితే దాంతో పిల్ల‌ల‌కు కొంత ఊర‌ట క‌లిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు విద్యావేత్త‌లు చెబుతున్నారు. అయితే పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు మాత్రం ఏమంటున్నాయంటే… చాలా మంది విద్యార్థులు త‌మ‌కు అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా, నిత్యం అన్ని పుస్త‌కాల‌ను, నోట్సుల‌ను తీసుకువ‌స్తారని, దీంతో వారి బ్యాగ్ బ‌రువు కూడా పెరుగుతుంద‌ని వాదిస్తున్నారు. మ‌రి… ఏదైనా ఒక చిన్న బుక్ తేక‌పోతేనే స్కూల్‌లో ఉపాధ్యాయులు విద్యార్థుల‌ను దండిస్తారు క‌దా… ఇక అలాంట‌ప్పుడు పిల్ల‌లు అన్ని బుక్స్‌ను తీసుకెళ్ల‌కుండా ఎలా ఉంటారు..? ఏది ఏమైనా ఇప్పుడు పిల్ల‌లు అనుభ‌విస్తున్న కిలోల కొద్దీ బ‌రువు మాత్రం వారిపై శారీర‌కంగా, మానసికంగా అనేక ర‌కాలుగా ప్ర‌భావం చూపుతోంద‌నేది వాస్త‌వం. ఆ బ‌రువు త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే పిల్ల‌లు మ‌రింత కుంగిపోయేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది..!

బస్ లో ఇద్దరమ్మాయిల మధ్య తీవ్రమైన గొడవను ఓ చిన్నమాటతో పరిష్కరించిన యువకుడు.


బస్ లో ఇద్దరమ్మాయిల మధ్య తీవ్రమైన గొడవను 

ఓ చిన్నమాటతో పరిష్కరించిన యువకుడు.


దిల్ సుఖ్ నగర్ నుండి హైటెక్ సిటి వైపుగా బయలుదేరింది పుష్పక్ బస్…. ఒకటి, రెండు సీట్లు మినహా బస్ అంతా ఆల్ మోస్ట్ ఫుల్ గా ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ పక్కపక్కనే కూర్చొని కంపెనీ కబుర్లు చెప్పుకుంటున్నారు. బస్ లక్డికపూల్ చేరగానే జనాలంతా ఎగబడి , ఎగబడి ఎక్కారు. ఇంతకు ముందు చెప్పిన ఫ్రెండ్స్ ముందు ఓ సీటు ఖాళీగా ఉండడంతో.. ఇద్దరమ్మాయిలు ఫాస్ట్ గా ఆ సీట్ వైపుగా దూసుకొచ్చారు. ఓ అమ్మాయి దూరం నుండే  ఆ సీట్ మీద హ్యాండ్ బ్యాగ్ వేసింది. మరో అమ్మాయి ఆ సీటు దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్ తీసేసి కూర్చుంది.  ఓ 10 మంది దాకా నిలబడి ఉన్నారు.
ఇంతలో హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి ఆ  సీట్ దగ్గరికి వచ్చి ఎక్స్ క్యూజ్ మీ….ఇది నా సీట్ , మీరు లేవండి ప్లీజ్ అంది. దానికి కూర్చున్న ఆ అమ్మాయి నో…నేనే ఫస్ట్ వచ్చి కూర్చున్న అని చెప్పింది. లేదు నేను ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వేశాను, తర్వాత మీరొచ్చి కూర్చున్నారని ఆమె, అయినా…కర్చీఫ్ లు , హ్యాండ్ బ్యాగ్ లు వేయడానికి ఇదేమైనా పల్లెవెలుగు బస్సా అంటూ కోపానికొచ్చింది కూర్చున్న అమ్మాయి ….. బస్ లోని జనాలంతా వీరివైపే చూస్తున్నారు. అది గమనించి ఎలాగైనా సీట్ దక్కించుకోవాలని ఇద్దరు పోటీ పడుతున్నారు.  చిన్నపాటి గొడవ జరుగుతుంది.
పక్క సీట్లో ఉన్న ఆ కుర్రాడు…ఎక్స్ క్యూజ్ మీ…అన్నాడు. ఏంటీ అన్నట్టు చూశారు ఆ ఇద్దరమ్మాయిలు, వారితో పాటు బస్ లోని జనాలు కూడా ఆ అబ్బాయి మీద దృష్టి సారించారు. సీట్ కోసం పోట్లాట ఎందుకు నేను ఓ మాట చెబుతాను దానికి తగ్గట్టు మీలో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఆ సీట్లో కూర్చోవాలో వద్దో  అని అన్నాడు. ఏంటీ అన్నట్టు ఆ అమ్మాయిలతో పాటు, బస్ లోని జనాలందరు  అతడు చెప్పే మాట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఎం లేదు..మీలో వయస్సులో ఎవరు పెద్దో వారు ఆ సీట్లో కూర్చొండి.. పెద్దలను గౌరవించండి అనే ఫార్ములాను ఫాలో అవుదాం అన్నాడు. అంతే…అప్పటి వరకు కుర్చీలో కూర్చొని ఉన్న అమ్మాయి ఠక్కున లేచి..సారీ మేడమ్ మీరే కూర్చొండి అంటూ ఆమెకు సీట్ ఇచ్చింది. దానికి ఆ హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి సారీ….సారీ…మీరే కూర్చొండి, ఆ సీట్ మీకే అంటూ సీటుకు దూరంగా జరిగింది. మేడమ్ కూర్చొండి అని ఆమె, పర్లేదు, పర్లేదు అని ఈమె…ఇద్దరూ సీట్ కు దూరంగా జరిగారు…ఇంతలో మరో 50 యేళ్లకు పైబడిన మహిళ  ఆమె థ్యాంక్స్ బాబు, కాళ్లు బాగా నొస్తున్నాయి  అంటూ వచ్చి  ఆ సీట్లో కూర్చుంది.

Tuesday, December 20, 2016

అమ్మ మృతిపై బయటపడ్డ మిస్టరీ..!!


అమ్మ మృతిపై బయటపడ్డ మిస్టరీ..!!అన్నాడీఎమ్‌కే అధినేత్రి, మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిపై అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఆమెపై విష‌ప్ర‌యోగం జ‌రిగింద‌ని స్వ‌యానా ఆమె బంధువులే ఆరోపిస్తున్నారు. ఆమెకు తెలియ‌కుండా.. మెడిసిన్ మార్చార‌న్న వదంతులు కూడా వినిపించాయి. అస‌లు నిజ‌మేంటి…? అనేది మిస్ట‌రీగా మారింది. అపోలో వైద్య‌బృందం దీనిపై ఇంత‌వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. కానీ, తొలిసారిగా అపోలో చేరిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయే ముందువ‌ర‌కు ఏం జ‌రిగింది..? అనే విష‌యాల‌పై అపోలో చైర్మ‌న్ సి. ప్ర‌తాప్ రెడ్డి ఓ ఇంగ్లీష్ పేప‌ర్‌కి ఇచ్చిన ఇంట‌ర్‌వ్యూలో వివ‌రించారు..అమ్మ అపోలోలో చేరిన‌ప్ప‌టి నుంచి ఆమెకు మెరుగైన చికిత్స అందించామ‌ని, ఆమెను ఒక‌టీరెండు రోజులు మిన‌హా.. మిగిలిన అన్ని రోజులు తానే ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించాన‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 22న ఆస్ప‌త్రిలో చేరిన‌ప్ప‌టి నుంచి… జ‌య‌ల‌లిత చికిత్స‌కు బాగా స్పందించార‌ని, ప్ర‌తి రోజూ తన‌ని చూసే న‌వ్వేవార‌ని చెప్పారు.
కొన్ని రోజుల చికిత్స త‌ర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నార‌ని, త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేసేందుకు సిద్ద‌మ‌య్యామ‌న్నారు. అయితే, డిసెంబ‌ర్ 5కి రెండు రోజుల ముందు తాను అత్య‌వ‌స‌ర ప‌ని మీద హైద‌రాబాద్ వ‌చ్చాన‌ని, తాను వ‌చ్చాక డిశ్చార్జ్ చేస్తామ‌ని తెలిపాన‌న్నారు. దానికి ఆమె సంతోషించార‌న్నారు. ఆమె ముఖంపై ఏనాడూ చిరున‌వ్వు చెర‌గ‌లేద‌న్నారు. స‌డెన్‌గా ఆమెకు డిసెంబ‌ర్ 4న గుండెపోటు వ‌చ్చింద‌ని.. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు చేయి దాటిపోయాయ‌న్నారు సి.ప్ర‌తాప్ రెడ్డి. కార్డియాల‌జిస్ట్ ఒక‌రు నిత్యం ఆమెను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని, కానీ, ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేక‌పోయామ‌ని వివ‌రించారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో అదే గ‌దిలో ఉన్న ఎక్మో యంత్రాన్ని ఆమెకు అమ‌ర్చినా ప‌నిచేయ‌లేద‌న్నారు.
ఎక్మో యంత్రం చాలా మందికి పాజిటివ్ ఫ‌లితాన్ని ఇచ్చింద‌ని, కానీ, జ‌య‌ల‌లిత విష‌యంలో అది వ‌ర్క్ అవ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.అపోలోలో చేరిన‌నాటినుంచి జ‌యలలిత చికిత్సలకు బాగా సహకరించారని, అనారోగ్యం సృష్టించిన బాధలన్నింటిని తట్టుకుని ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన కీర్తించారు. జయలలిత అసాధారణ మహిళ అని, ఆమె కోపంలోనూ ఓ న్యాయం దాగి ఉంటుందని, పార్టీ కార్యకర్తల్లోనే కాదు సామాన్య ప్రజానీకం మదిలోనూ ఆమె సుస్థిరస్థానం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?


జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య, 
అసలు ఏం జరిగింది?
విశాఖ: జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖలో చోటు చేసకుంది. కమెడియన్ పొట్టి రమేష్ భార్య త్రిపురాంభిక ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ గాజువాకలోని శ్రీనగర్ కాలనీలో నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. జబర్దస్త్ కార్యక్రమంతో పాటు భలే ఛాన్స్ లే లాంటి టీవీ షోల ద్వారా పాపులర్ అయిన రమేష్ గతేడాది డిసెంబర్ 12న త్రిపురాంబికను పెళ్లాడారు. త్రిపురాంబిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే రమేష్ విశాఖ చేరుకున్నారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తెలియదని రమేష్ తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


త్రిపురాంబిక తల్లి దండ్రుల ఆరోపణలు త్రిపురాంబిక తల్లిదండ్రులు, బంధువులు విశాఖ కేజీహెచ్‌కు చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి శోకసముద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పెళ్లైన మరుసటిరోజు నుంచే అత్త, ఆడపడుచు వేధించే వారని వారు ఆరోపించారు.
తల్లి ఆరోపణ త్రిపురాంబిక తల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ...మా అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరుపాలని, పోలీసులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

బెదిరింపు కాల్స్ ఈ ఘటనపై మహిళా సంఘం నేత ప్రభావతి మాట్లాడుతూ కేసులు పెట్టొద్దంటూ త్రిపురాంబిక కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు. ఈ కేసును పోలీసులు నిష్పాక్షింగా విచారణ జరపాలని కోరారు.

రమేష్ దిగ్భ్రాంతి తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తెలియదని రమేష్ తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

తనకొచ్చిన PF మొత్తాన్ని గ్రామానికి రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన ఆర్మీ ఉద్యోగి.


తనకొచ్చిన PF మొత్తాన్ని గ్రామానికి రోడ్డు 

వేయడానికి ఖర్చు చేసిన ఆర్మీ ఉద్యోగి.


మ‌న దేశంలో ప‌ట్ట‌ణాలు, న‌గరాల్లో ఉన్న రోడ్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ గుంత‌లు, మ్యాన్‌హోల్స్ పైకి లేచి, ప్యాచ్ వ‌ర్క్‌తో రంధ్రాలు ప‌డి… ఇంకా చెప్పాలంటే ఇదిలా సాగుతూనే ఉంటుంది. కాంట్రాక్ట‌ర్ల క‌క్కుర్తి, ప్ర‌భుత్వ అధికారుల నిర్లక్ష్యం వెర‌సి ఎక్క‌డ చూసినా రోడ్ల ప‌రిస్థితి అధ్వాన్నంగానే ఉంది. అయితే ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో ఉన్న రోడ్లే ఇలా ఉంటే ఇక గ్రామాల్లో ఉండే రోడ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే అక్క‌డ రోడ్లే ఉండ‌వు కాబ‌ట్టి. మ‌ట్టిబాటే గ్రామ‌వాసుల‌కు ర‌హ‌దారి. ఆ దారిలోనే వెళ్లాలి. రావాలి. ఇక వర్షం ప‌డితే అంతే సంగ‌తులు. మోకాళ్ల లోతుకు దిగ‌బ‌డాల్సిందే. అదీ గ్రామాల్లోని ర‌హ‌దారుల ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో స‌రిగ్గా ఇలాంటి స్థితిలో ఉన్న ఓ గ్రామ ర‌హ‌దారిని త‌న సొంత ఖ‌ర్చుల‌తో నిర్మించాడు ఆ వ్య‌క్తి. అత‌నే బ‌గ్గూరాం మౌర్యా. మాజీ సైనికాధికారి..!
వార‌ణాసిలోని హీరాంపూర్ గ్రామంలో నివాసం ఉండే బ‌గ్గూరాం మౌర్యా 1978లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 2012లో లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ క్ర‌మంలో అత‌ను 2002లో ఒక‌సారి, 2012లో మ‌రోసారి అప్ప‌టి రాష్ట్ర‌ప‌తులు అబ్దుల్ క‌లాం, ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీల చేతుల మీదుగా మెడ‌ల్స్‌ను కూడా అందుకున్నాడు. అనంత‌రం ఉద్యోగం నుంచి రిటైర్ అయినందుకు గాను అత‌నికి రూ.4 ల‌క్ష‌ల పీఎఫ్ కూడా వ‌చ్చింది. అయితే ఆ మొత్తాన్ని అత‌ను త‌న‌కు గాను, త‌న కుటుంబానికి గానీ వాడుకోలేదు. త‌మ గ్రామంలో ర‌హ‌దారి బాగాలేక‌పోవ‌డంతో ఆ డ‌బ్బుల‌ను ర‌హ‌దారి నిర్మాణానికి వినియోగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు.
అయితే బ‌గ్గూరాం మౌర్యా ఆ ర‌హ‌దారి నిర్మాణాన్ని స్వాతంత్ర్య దినోత్స‌వ కానుక‌గా త‌న గ్రామ ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్న‌ట్టు తెలిపాడు. ఈ క్ర‌మంలో చాలా వ‌ర‌కు ర‌హ‌దారి నిర్మాణం పూర్త‌యింది. కానీ ఇంకా కొంత పెండింగ్ ఉండ‌డంతో దానికి బ‌గ్గూరాం మౌర్యా వ‌ద్ద ఉన్న డ‌బ్బులు స‌రిపోలేదు. దీంతో ఆ రోడ్డు నిర్మాణం అక్క‌డికి ఆగిపోయింది. అయినా అత‌ను త‌న ప్ర‌య‌త్నం విడిచిపెట్ట‌లేదు. ఎలాగైనా త‌మ గ్రామ ర‌హ‌దారిని పూర్తి చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి విన్న‌వించాడు. మ‌రి బ‌గ్గూరాం మౌర్యా విన‌తికి ప్ర‌భుత్వ అధికారులు, నాయ‌కులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా వృద్ధాప్యంలో త‌న‌కు వ‌చ్చిన పీఎఫ్ డ‌బ్బును సొంత అవ‌స‌రాల‌కు వాడుకోకుండా సామాజిక సేవ‌కై వినియోగించిన బ‌గ్గూరాం మౌర్యా ఆద‌ర్శాన్ని మ‌న‌మంద‌రం అభినందించాల్సిందే..!

500/1000 నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇది


500/1000 నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇది


మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆశామాశీగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భాధ ఏంటో . కానీ ఆ ఆలోచన ఏంటో తెలిశాక మనం నుంచున్నది మన మంచి కోసమే అని అర్ధం చేసుకుంటారు.
అసలు ఇంతకీ ఆ ఆలోచన ఏంటి? దానివల్ల మామూలు మనుషులకు కలిగే లాభం ఏంటి?
ఈ విషయాలు తెలుసుకునే ముందు మనం డబ్బు గురించి కొన్ని శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడనుంచి కాస్త జాగ్రత్తగా చదవండి.
మీకు ఎప్పుడైనా అనిపించిందా, డబ్బు కాగితాలను ముద్రించేది మన ప్రభుతమే కదా, అలాంటప్పుడు డబ్బులు అందరికి కావలసినన్ని ముద్రించి ఇచ్చెయ్యచ్చు కదా? అలాంటప్పుడు ఇక పేదవాళ్ళు అసలు ఉండరు కదా?
అలా మనం చేస్తే దేశం నాశనం అవ్వడం ఖాయం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు డబ్బు ముద్రించాలంటే దానికి పాటించాల్సిన పద్ధతి ఏంటో ముందు తెలుసుకుందాం.
మీరు మన డబ్బు నోట్లమీద చూసే ఉంటారు, మన RBI గవర్నర్ సంతకం దగ్గర ఒక సందేశం, హిందీ లో మరియు ఆంగ్లం లో ఇలా ఉంటుంది “I promise to pay the bearer the sum of One Hundred Rupees” ఈ సందేశం అర్ధం ఏంటో తెలుసా మీకు?
తెలియకపోతే వినండి. దాని అర్ధం ఏంటంటే RBI గవర్నర్ గారు మనకి ప్రమాణం చేస్తున్నారు, ఒకవేళ మీకు ఈ వంద రూపాయలు అవసరం లేదనుకోండి , మీరు మీ డబ్బుని భారత ప్రభుత్వానికి ఇచ్చేదాం అనుకుంటున్నారు అనుకుందాం, ఆ సందర్భంలో RBI మనకి 100రూపాయలకు సరిపడా బంగారం ఇస్తుంది.
మీ దగ్గర 1 రూపాయి ఉన్నా, 100 కోట్లు ఉన్నా, ఆ డబ్బు మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ డబ్బుకి సరిపడా బంగారం తీసుకోవచ్చు.
ఈ సుత్తి అంతా ఎందుకు చెప్తున్నావురా బాబు అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే అసలు విషయం దాగి ఉంది.
మన దేశ ఆర్ధిక పరిస్తితిని మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారంతో కొలుస్తారు. ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనలో ఎవరైనా మాకు డబ్బు వద్దు , ఈ డబ్బు మీరు తీసేసుకోండి అన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర డబ్బుకి సరిపడా బంగారం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి. అర్ధం అవుతుంది కదా?
అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బుని ముద్రిస్తారు అని.
ఈ బంగారానికి నల్ల డబ్బుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? హా అక్కడికే వస్తున్నా.
మన ప్రభుత్వం డబ్బు ఎన్నో సంవత్సరాల నుండి ముద్రిస్తూ ఉంది. బంగారం నిల్వలు పెరిగిన కొద్ది డబ్బు ముద్రించడం కూడా పెరిగింది. ఆ డబ్బు అంతా బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు చేరుతుంది. అయితే ఈ డబ్బు సామాన్యులకి ఉపయోగపడకుండా బడా బాబుల బీరువాల్లోకి చేరిపోయింది.
పెద్ద పెద్ద నల్ల బాబులంతా దేశం లో ఉన్న డబ్బులో చాలా మటుకు ఏదో విధంగా సంపాదించి, సంపాదించిన దానికి టాక్స్ కట్టకుండా, దాచి పెట్టేసారు. ఇలా టాక్స్ కట్టకుండా, బ్యాంకులో వేయకుండా డబ్బుని దాచినందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఖర్చు పెట్టకపోతే, ఆ డబ్బుకి చిత్తు కాగితాలకి తేడా లేదు.
ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.
గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ గనుక మనం చూసినట్లయితే మనకి తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ. తరతరాలుగా మన దేశ పరిస్తితి ఇలానే ఉంది. మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనది ఎప్పుడూ లోటు బడ్జెట్ అంటారు. అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదని అర్ధం. సరిపడా డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు దగ్గర, మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా డబ్బు లేకపోవడాన్ని ఆర్ధిక లోటు అని కూడా అంటారు.
మన మోడీ గారు ఈ ఆర్ధిక లోటుని పూడ్చడానికి అయన పదవిలోకి వచిన్నప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారుగా, ఆయన దేశ దేశాలు తిరిగి ఆ దేశాల వాళ్ళని మన దేశం లో పెట్టుబడులు పెట్టమని కోరుతున్నారు. అదే కాకుండా ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చి మన దేశం లో పెట్టుబడులు పెట్టడానికి బయట దేశాలకు ఎర్ర తివాచి పరిచారు.
అయితే అందరికి తెలిసిన రహస్యం ఏంటంటే, మన దేశంలో నల్ల బాబుల దగ్గర ఉన్న డబ్బు అంతా బయటకి తీస్తే వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు అని. డబ్బు బయటకి తీయడం అంటే ఆ డబ్బుని బ్యాంకులో వేయడం ఒకదారి.
మోడీ గారు నల్ల బాబులకి ఒక ఆఖరి అవకాసం ఇచ్చారు. సెప్టెంబర్ ౩౦ లోగా మీ డబ్బుని లెక్కల్లో చూపి టా

Monday, December 19, 2016

చెన్నైలో పిల్లి బిర్యానీ , హైదరాబాద్ లో కుక్క బిర్యానీ హల్ ఛల్ ఇంకా మనం తెలుసు కోవాల్సిన నిజాలుచెన్నైలో పిల్లి బిర్యానీ , హైదరాబాద్ లో కుక్క బిర్యానీ 
హల్ ఛల్   ఇంకా మనం తెలుసు కోవాల్సిన నిజాలు

మూత్రాన్ని ఆపుకొంటే ప్రాణాలకు ప్రమాదం. కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది.


మూత్రాన్ని ఆపుకొంటే ప్రాణాలకు ప్రమాదం. 
కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది.

నోట్లు రద్దుతో ఆర్.బి.ఐ కే అంతు చిక్కని ఆ రహస్యం వెలుగులోకి వచ్చింది…మోడీ  నల్లదనం బయటకు తీయడానికి నోట్లు రద్దు ని నవంబర్ 8న చేశాడు.కానీ ఇపుడు కూడా  ఆర్.బి.ఐ కే అంతు చిక్కని ఆ రహస్యం వెలుగులోకి వచ్చింది… ఆ రహస్యం తెలుసుకోవడానికి ఈ వీడియో చుడండి…


videoనో డౌట్..పవన్ పంచ్ లు వారిపైనే..


నాలుగు రోజులుగా ప‌వ‌న్ యాక్టీవ్ అయ్యారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా చెల‌రేగిపోతున్నారు. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ఇప్పుడు గ్యాప్ లేకుండా స్పందించే అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధిస్తూనే ఉన్నాడు. ప‌వ‌న్ తొలిరోజు… గోవ‌ధ‌… ఆవుల సంర‌క్ష‌ణ పేరుతో బీజేపీ, దాని మిత్రులు చేస్తున్న గంద‌ర‌గోళాన్ని ప్ర‌శ్నించారు.గోవుల ప్రేమ ఒల‌కబోస్తున్న బీజేపీ నేత‌లు ఎందుకు త‌లా ఒక ఆవును ద‌త్త‌త తీసుకుని సాక‌రేం అంటూ నిల‌దీశారు. ఇక రెండో రోజు రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌కు క‌మ‌ల‌నాథులు… ఆ పార్టీ సిద్ధాంతాల‌ను అనుస‌రించేవారు ఎలా కార‌ణ‌మ‌య్యారో చెప్పారు. మూడో రోజు దేశ భ‌క్తి అంటే అధికారంలోని పార్టీల‌కు వంత పాడ‌డం కాద‌ని… ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహి ముద్ర వేయ‌డం స‌రికాద‌ని సూటిగా నిల‌దీశారు. వీట‌న్నింటిలో కామ‌న్ పాయింట్ కేంద్రంలోని బీజేపీ. ఆ పార్టీ నేతృత్వంలోని మోడీ ప్ర‌భుత్వం. ఏపీలో ఎద‌గాల‌నుకుంటున్న ప‌వ‌న్… కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో పునాదులు కూడా లేని బీజేపీని త‌న ప్ర‌ధాన శ‌త్రువుగా ఎందుకు ఎంచుకున్నాడ‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం.
నాలుగోరోజైన ఆదివారం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే అంశంలో బీజేపీ చేసిన మోసాన్ని ఎండ‌గ‌ట్టారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీకి, రాష్ట్రంలో చంద్ర‌బాబుకు ప‌వ‌న్ మ‌ద్ద‌తుగా నిలిచారు. మొన్నామ‌ధ్య జ‌రిగిన మూడు స‌భ‌ల‌లో కూడా తాను ఎంతో కొంత భారం మోయ‌బ‌ట్టే ఈ రోజు కేంద్రంలో, ఏపీలో ఆయా పార్టీలు అధికారంలో కూర్చున్నాయ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. కాబ‌ట్టే వారు చేసే ప‌నుల‌ను ప్ర‌శ్నించే హ‌క్కు త‌న‌కుంద‌ని స్ప‌ష్టం చేశారు.  ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీలో బ‌ల‌ప‌డాల‌న్న ల‌క్ష్యంతోనే బీజేపీని రాజ‌కీయంగా టార్గెట్ చేసి దాని విధానాలు, ప్ర‌జా వ్య‌తిరేక పనుల‌ను ఎండ‌గట్టి త‌ద్వారా ఆ ప్ర‌భుత్వానికి మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీకి కూడా దాని ప్ర‌జా వ్య‌తిరేక ప‌నుల్లో భాగం ఉంద‌ని చెప్ప‌డానికే ప‌వ‌న్ ఈ దారి ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా చంద్ర‌బాబు ఎందుకు నిల‌దీయ‌లేక‌పోతున్నార‌ని ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Sunday, December 18, 2016

అదృష్టం,సక్సెస్ పొందాలంటే బయటకు వెళ్ళేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వాలంట….


అదృష్టం,సక్సెస్ పొందాలంటే బయటకు వెళ్ళేటప్పుడు 

ఈ టిప్స్ ఫాలో అవ్వాలంట….


మనలో చాలా మంది వారి వారి గోల్స్ కోసం తెగా కష్టపడుతుంటారు.కాని ఎంత కష్టపడినా అదృష్టం లేక సక్సెస్ పొందలేరు.సో ఇలాంటి వారు అదృష్టం తమ వైపు వేసుకోవడానికి కొన్ని స్మాల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అవేమిటంటే ఇప్పుడు ఒక సారి చూద్దాం.

1. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముందుగా చేతులను శుభ్రంగా నీళ్ళతో గాని, పచ్చి పాలతోగాని శుభ్రం చేసుకోవాలి.
2.బెల్లం, నీళ్ళు కలిపిన నీళ్ళు తాగితే అదృష్టం తో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు వస్తుంది.
3. లవంగాలను జేబులో పెట్టుకోని దాని వాసనను చూస్తే మనలో వున్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
4. ఇంటి ముందు మిరియాలు చల్లండి, దీని వల పాజిటివ్ ఎనార్జీ మనలో చేరుతుంది.

శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే.. సిరిసంపదలకు లోటు ఉండదట!


శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే.. 

సిరిసంపదలకు లోటు ఉండదట!


ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం లక్ష్మిదేవిని ఇలా పూజించాలని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. శుక్రవారం రోజు గోమతి చక్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ గోమతి చక్రం చూడటానికి శ్రీ మహా విష్ణువు ఆయుధం శుదర్సన చక్రం ఆకారంలో ఉంటుంది. ఇది లక్ష్మి దేవి జన్మ స్థానం అయిన నీటిలో లభిస్తుంది. కాబట్టి లక్ష్మి దేవికి గోమతి చక్రం అంటే ఎంతో ప్రీతి దాయకమని శాస్త్రాలు చెబుతున్నాయి.
* తీవ్ర అనారోగ్యంతో బాధ పడేవాళ్లు తప్పనిసరిగా గోమతి చక్రాన్ని ఉపయోగిస్తే మంచిది. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో గోమతి చక్రాన్ని వేసి, ‘ఓం వం ఆర్యోనికరీ రోగానశేషా నమః’ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించిన తరువాత గ్లాసులో నుంచి గోమాతిచాక్రాన్ని తీసివేసి ఆ నీటిని తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* రాహు, కేతు, సర్ప దోషాలు ఉన్న వారు శుక్రవారం పూజ మందిరం లో గోమతి చక్రాలను ఉంచి దానికి పసుపు కుంకుమలను అలంకరిస్తే ఈ దోషాల నుంచి బయట పడొచ్చు.
* చిన్న పిల్లల్లో దృష్టి దోషం పోవాలంటే గోమతి చక్రాన్ని ఒక వెండి తాయిత్తులో ఉంచి, పిల్లల మేడలో వేస్తే దృష్టి దోషం నుంచి బయట పడవచ్చు.
* వ్యాపార నష్టాలు పోవాలంటే సింహ ద్వారం ముందు, రెండు గోమతి చక్రాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో అలా వేలాడదీయాలి. వాటి కిందనుంచి నడవటం వల్ల వ్యాపారంలో లాభాలు పొందటానికి ఆస్కారం ఉందని శాస్త్రం చెబుతోంది.
* కోర్టు పనుతో పాటుగా ఇతర ముఖ్యమైన పనులు మీద బయటకు వెళ్ళినా గోమతి చక్రాని దగ్గర ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుంది. గృహ నిర్మాణంలో పునాదులలో నాలుగు వైపులా 11 గోమతి చక్రాలను పెడితే ఎలాంటి వాస్తు దోషం ఉండదు.